జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్లలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మెట్పల్లి ప్రభుత్వాసుపత్రితో పాటు, కోరుట్ల తెరాస కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.
పేద ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్పల్లి పురపాలక కార్యాలయంలో ఛైర్పర్సన్ సుజాత జాతీయ జెండాను ఎగురవేసి పట్టణ ప్రజలకు, కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి: విద్యుత్ రంగంలో వెలుగుతున్న తెలంగాణ