జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. 77 మంది లబ్ధిదారులకు రూ. 77 లక్షల 80 వేల చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం అమలు నాటి నుంచి బాల్యవివాహాలు తగ్గిపోయినట్లు వెల్లడించారు. నిరుపేద ఆడపిల్లల కుటుంబాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
ఇదీ చదవండి: తమను పట్టించుకునే నాథుడే లేరు: కిడ్నీరోగులు