జగిత్యాల జిల్లా మండల కేంద్రంలోని నర్సింగాపూర్‌లో పల్లె ప్రకృతివనం అందుబాటులోకి వచ్చింది. రెండెకరాల విస్తీర్ణంలో 5,800 మొక్కలు నాటారు. చెట్ల గొప్పతనాన్ని తెలిపే బొమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తోంది. రంగు రంగుల పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
జిల్లాలో తొలిసారిగా పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పల్లెల్లో ఆహ్లాదం పంచటంతో పాటు పర్యావరణానికి పల్లె ప్రకృతి వనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'మీరు చెప్పింది చేస్తే... మిమ్మల్ని సన్మానిస్తాం'