రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో వారికి అర్చక స్వాములు ఆశీర్వచనం అందించారు. స్థానిక మున్సిపల్ ఛైర్పర్సన్ రామతిర్తపు మాధవి రాజు శేషవస్త్రం అందజేశారు.
అనంతరం ఆలయ విస్తరణలో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల నమూనాను ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది వివరించారు. గుడి చెరువును పరిశీలించారు.
ఇదీ చదవండి: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు