విజయ దశమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పూజలు నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జమ్మిచెట్టుకు ఆయుధ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు హాజరు కావడంతో వారికి ఎమ్మెల్యే పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఘనంగా సత్కరించారు.
ఇదీ చూడండి: మోండామార్కెట్లో రసాయనిక పేలుడు... త్రుటిలో తప్పిన ప్రమాదం