జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణ కేంద్రంలోని 23, 24 వార్డుల్లో పదిహేడు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణితో కలిసి భూమిపూజ చేశారు.
జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వైద్యకళాశాలను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Ts Lockdown: రాష్ట్రంలో లాక్డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్