ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్‌కు (Balka Suman) పితృవియోగం జరిగింది. సుమన్ తండ్రి, మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బాల్క సురేష్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. బాల్క సురేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. సురేష్ తెరాసలో చురుగ్గా పనిచేశారని గుర్తు చేశారు. బాల్క సుమన్‌ను కేసీఆర్ ఫోన్లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
బాల్క సురేష్ మరణం పట్ల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) సంతాపం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ తండ్రి మరణం పట్ల మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. సురేష్ అంత్యక్రియలు రేగుంటలో సాయంత్రం 6 గంటలకు జరగనున్నాయి.