ETV Bharat / state

MISSION BHAGIRATHA: మురికి కాలువలోకి మిషన్ భగీరథ నీరు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. గత 10 రోజుల నుంచి శుద్ధినీరు మురికి కాలువలో కలుస్తుంది. గేట్ వాల్ చెడిపోవడంతో నీరు వృథా అవుతున్నా.. సంబంధిత అధికారు మాత్రం పట్టించుకోవడం లేదు.

mission-bhagiratha-water-is-wasted-in-metpalli-town-of-jagittala-district
మిషన్ భగీరథ నీరు.. వృథాగా మురికి కాలువలోకి
author img

By

Published : Jun 17, 2021, 10:30 AM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతోంది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో ఫిల్టర్ బెడ్​లో 10 రోజుల క్రితం ఫిల్టర్ బెడ్ వద్ద గేటు వాల్ చెడిపోవడంతో మంచి నీరంతా మురుగు కాలువలో కలిసిపోతుంది. ప్రతిరోజు ఫిల్టర్ బెడ్​లో భగీరథ నీటిని నింపిన తర్వాత గేట్ వాల్ బంద్ చేయడంతో చుక్క నీరు వృథాగా పోకుండా ఉండేది. ప్రస్తుతం రోజంతా భగీరథ నీరు వృథాగా పోతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

mission-bhagiratha-water-is-wasted-in-metpalli-town-of-jagittala-district
మురికి కాలువలోకి పోతున్న నీరు

మూడు నియోజకవర్గాలకు సరఫరా అయ్యే ప్రధాన పైప్​లైన్ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో వాటర్ గ్రిడ్​ను ఏర్పాటు చేశారు. అక్కడినుంచి కోరుట్ల జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే మెట్​ పల్లి వద్ద ప్రతిరోజు ఫిల్టర్ బెడ్​లో నీటిని నింపి ట్యాంకు నిండిన తర్వాత గేట్లు బంద్ చేయడంతో నీటి ఉధృతి కింది స్థాయి వరకు ఎక్కువగా ఉంటుంది. గేటు వాలుకు మరమ్మత్తు చేయక పోవడంతో నీరు వృథాగా పోతున్న పట్టించుకునే వారు లేకుండా పోయారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​గా సత్య నాదెళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.