ETV Bharat / state

కాళేశ్వరం పనుల్లో జాప్యంపై మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం - వేముల ప్రశాంత్​రెడ్డి

జగిత్యాల జిల్లా మెట్​పల్లి జిల్లా రాజేశ్వరరావుపేట వద్ద జరుగుతున్న కాళేశ్వరం రివర్స్​పంపింగ్​ పనులను మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పరిశీలించారు. నిర్మాణాల్లో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 5 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

కాళేశ్వరం పనుల్లో జాప్యంపై మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం
author img

By

Published : Jul 24, 2019, 10:39 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్‌ పంపింగ్‌ పనులలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద జరుగుతున్న కాళేశ్వరం నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రశాంత్​రెడ్డి పరిశీలించారు. నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యతో పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. నిర్మాణాలను వేగవంతం చేసి ఆగస్టు 5 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.

కాళేశ్వరం పనుల్లో జాప్యంపై మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆగ్రహం

ఇవీ చూడండి: శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.