జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం జేఎన్టీయూ క్యాంపులో వంద పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్య సౌకర్యాలను పరిశీలించారు. కొవిడ్ బారిన పడిన వారికి అందించే వైద్య సదుపాయాలను తెలుసుకున్నారు. కరోనా రోగుల చికిత్స కోసం ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
జిల్లా కేంద్రంలో 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటి వద్ద చికిత్స పొందే వీలులేని వారి కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఉన్న వంద పడకల ఐసోలేషన్ కేంద్రంలో ప్రస్తుతం 11 మంది చికిత్స పొందుతున్నారు. మరింత ఎక్కువ మందికి అవసరమైతే 200 పడకలకు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా