ETV Bharat / state

Minister koppula Eshwar: 'ప్రజల ఆరోగ్యమే సీఎం కేసీఆర్​ లక్ష్యం' - Koppula Ishwar

రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా... రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్​ అందేలా సీఎం కేసీఆర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

minister koppula
minister koppula
author img

By

Published : Sep 18, 2021, 7:05 PM IST

జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్​పై ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా సీఎం కేసీఆర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నూటికి నూరుశాతం వ్యాక్సిన్ అందించాలని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాత కరోనా వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని తెలిపారు. వ్యాక్సినేషన్ అనంతరం కరోనా వచ్చినప్పటికి ప్రాణాలకు ఎలాంటి అపాయం ఉండదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: Tollywood Drugs case: పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.