జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉమాశంకర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పలువురు దాతల ద్వారా నిత్యావసర సరకులను ఏర్పాటు చేసి.. 130 మంది ఆటో కార్మికులు, పేద కుటుంబాలకు అందజేశారు. అనంతరం వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి లాక్డౌన్కు సహకరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి పాల్గొన్నారు.