జగిత్యాల జిల్లా జయశంకర్ యూనివర్శిటీ పొలాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన వానకాలం సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. ఈ సీజన్‌లో చేపట్టబోయే పంటల పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.
రైతులు ఒకే రకం పంట వేయకుండా పంట మార్పిడి చేయాలని మంత్రి సూచించారు. ఈ వానకాలంలో పంట దిగుబడి మరింత సాధించాలని... ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచిందన్నారు. అన్ని రంగాల్లో రైతులను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం ముందుంటుందన్నారు. రుణమాఫీ, రైతు బంధు రైతులకు అందిస్తుందన్నారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!