ETV Bharat / state

కేంద్రం నుంచి నిధులు తెచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి: హరీశ్‌రావు - జగిత్యాలలో సీఎం సభ

Harish Rao fires on BJP: తెలంగాణకు కేంద్రప్రభుత్వం అధికంగా నిధులు ఇస్తోందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా భాజపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్ధికమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలూ... ఆయా రాష్ట్రాల్లో భాజపా... ఈడీ, ఐటీ దాడులు చేయడం సర్వసాధారణమని ఆరోపించారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వందల సంఖ్యలో పథకాలను రద్దు చేసిందని మంత్రి ఆక్షేపించారు. జగిత్యాలలో సీఎం పాల్గొనే సభాస్థలిని కొప్పుల ఈశ్వర్, కవితలతో కలిసి ఆయన పరిశీలించారు.

Harish Rao
Harish Rao
author img

By

Published : Dec 1, 2022, 6:20 PM IST

Updated : Dec 1, 2022, 7:54 PM IST

Harish Rao fires on BJP: ఎన్నికలు వస్తున్నాయంటే చాలూ... ఆయా రాష్ట్రాల్లో భాజపా... ఈడీ, ఐటీ దాడులు చేయడం సర్వసాధారణమని ఆర్ధికమంత్రి మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం అధికంగా నిధులు ఇస్తోందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా భాజపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పన్నుల వాటా పూర్తిగా తగ్గించి... పైగా అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వందల సంఖ్యలో పథకాలను రద్దు చేసిందని మంత్రి హరీశ్​రావు ఆక్షేపించారు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా తగ్గిందని తెలిపారు. అయినా రాష్ట్రాలకు...42 శాతం వాటా ఇస్తున్నట్లు భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని హరీశ్‌ మండిపడ్డారు. రాష్ట్రాలకు కేవలం 29.6 శాతం మాత్రమే పన్నుల వాటాగా ఇస్తున్నారన్నారు. ఈనెల 7న జగిత్యాల కలెక్టరేట్‌ సముదాయం, తెరాస కార్యాలయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారని తెలిపారు.

కేంద్రం నుంచి నిధులు తెచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి: హరీశ్‌రావు

'రాష్ట్రాలకు అధికంగా నిధులిస్తున్నామని భాజపా తప్పుడు ప్రచారం. పన్నుల వాటాల్లో 42 శాతం ఇస్తున్నామన్న కిషన్‌ రెడ్డి వ్యాఖ్యపై చర్చకు సిద్ధం. పొరుగు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు మమ్మల్ని కలిశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోని సర్పంచ్‌లు మమ్మల్ని కలిశారు. తెలంగాణలో కలపుకోవాలని సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి భాజపా నేతలు మాట్లాడాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. బకాయి నిధులు తీసుకువచ్చి కిషన్‌రెడ్డి మాట్లాడాలి.'-హరీశ్​ రావు, ఆర్థిక మంత్రి

ఉద్యమాల గడ్డ తెలంగాణలో కుట్రలు నడవవు : ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయంటే చాలూ... భాజపా ఈడీ, ఐటీ దాడులు చేయడం సర్వసాధారణంగా మారిందని హరీశ్​ పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలు ఉద్యమాల గడ్డ తెలంగాణలో నడవవని స్పష్టం చేశారు. భాజపా ఎన్ని కేసులు పెట్టినా, వేధింపులకు గురిచేసినా ప్రజలపక్షాన నిలబడుతామని, తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని హరీశ్ రావు తెలిపారు. భాజపా వదిలిన బాణాలు ఉంటాయని... రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, కవిత పరిశీలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2022, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.