ETV Bharat / state

జగిత్యాల నుంచి మధ్యప్రదేశ్​కు కాలినడకన బయలుదేరిన కూలీలు - labour

పని కోసమని వచ్చిన మధ్యప్రదేశ్​కు చెందిన భవన నిర్మాణ కార్మికులు కాలి నడకన తిరుగు పయనమయ్యారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల నుంచి 13 మంది బయలుదేరి వెళ్లారు.

migrate labours returned to madhyapradesh by walk
జగిత్యాల నుంచి మధ్యప్రదేశ్​కు కాలినడకన బయలుదేరిన కూలీలు
author img

By

Published : Apr 15, 2020, 7:57 AM IST

కరోనా వైరస్‌ కారణంగా వలస కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనతా కర్ఫ్యూ కంటే రెండు రోజుల ముందుగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చేరుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులు... ఇన్నాళ్లు ఇక్కడ పనిలేకపోవటం వల్ల తిరిగి తమ రాష్ట్రానికి కాలి నడకన బయలుదేరి వెళ్లారు. మహిళలతో కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. జగిత్యాలలో కాలి నడకన వెళుతున్న కూలీలను గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించారు.

మధ్యప్రదేశ్‌కు చేరాలంటే 300 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుందని వారు తెలిపారు.. వాహన సౌకర్యం లేకపోవటంతో కాలినడకన వెళుతున్న వారికి తాగునీరు, పండ్లను కొందరు స్థానికులు అందజేశారు.. ఎలాగైన ఇంటికి చేరుకుంటే అదే చాలని కూలీలు తెలిపారు.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఇలాంటి వలస కూలీలను స్వగ్రామాలకు చేర్చాలని ఆ కార్మికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.