జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలిక పరిధిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవాలంటూ భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలిక అనుమతులు లేకుండా భవంతులు నిర్మిస్తూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. అవినీతిని ఎందుకు అడ్డుకోవడం లేదంటూ పురపాలిక సర్వసభ్య సమావేశానికి హాజరయైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముందు కౌన్సిలర్లు అధికారులపై విరుచుకుపడ్డారు.
పట్టణంలో పుర అనుమతులు లేకుండా 182 నిర్మాణాలు జరిగాయని ఎమ్మెల్యేకు తెలిపారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. దీంతో తెరాస, భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్లతో కూడిన కమిటీ వేసి వెంటనే అనుమతులు లేని భవంతులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశించారు.
ఇదీ చదవండి: అందం, నటనతో అలరించే ముద్దుగుమ్మ విద్యాబాలన్!