లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉపాధి లభించక కాలినడకన సొంతూళ్లకు వెళ్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కూలీలు హైదరాబాద్ నుంచి కాలినడకన తమ స్వస్థలానికి బయల్దేరారు. వారిని జగిత్యాలలో అధికారులు అడ్డుకోగా... వారికి మెప్మా ఆపన్నహస్తం అందించింది. భోజనం, వసతి ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి కాలినడకన బయల్దేరినట్లు వారు తెలిపారు. ఎలాగైనా తమను స్వరాష్ట్రం పంపాలని వారు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: పింఛన్‌దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?