జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పలు వార్డుల్లో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నివారణపై విస్తృత ప్రచారం చేశారు. వార్డుల్లో మురుగు కాలువలను శుభ్రం చేయించి... చెత్తాచెదారం లేకుండా, దోమల మందు చల్లి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేసి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: సర్వీస్ ఛార్జీల పేరుతో... రైల్వేశాఖ "దొడ్డిదారి దోపిడీ"!