జగిత్యాల జిల్లా కేంద్రంలో మేడే కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్.. జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా కాలంలోనూ కార్మికులు పని చేస్తున్నారని కొనియాడారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'మిగతా మంత్రుల భూకబ్జాలపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించాలి'