జగిత్యాల జిల్లా శ్రీరాంనగర్‌కు చెందిన లహరి అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా బలవన్మరణానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అత్తింటి వారి వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. గతంలో అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. అత్తాకోడళ్ల మృతి