జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండా ప్రయాణించాడు. అతణ్ని మాస్కు ఏదని కండక్టర్ అడగడం వల్ల వాగ్వాదానికి దిగాడు. కొంతసేపటి తర్వాత బస్సు దిగిన యువకుడు పక్కనే ఉన్న భవనంపై ఎక్కి బెదిరింపులకు పాల్పడ్డాడు.
నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కి ప్రాణాలు తీసుకుంటానని హల్చల్ చేశాడు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు యువకుణ్ని దింపేశారు.
- ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 5,695 కరోనా కేసులు, 49 మరణాలు