జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్‌లో మల్లన్న జాతర వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ జాతర రెండో రోజు ఆదివారం మల్లన్న స్వామికి పెద్ద ఎత్తున బోనాలు తీశారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
మల్లన్న ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:దేశంలో 'జనగణ' మన సమస్య ఇది!