రాష్ట్రంలోని గ్రామాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండో దశలో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జగిత్యాల జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. తాజాగా రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో 30 మందికిపైగా వైరస్ నిర్ధారణ అయింది. ఫలితంగా ఆ ఊరిలో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున లాక్డౌన్ విధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పంచాయతీ అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు