కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. వాటిని బేఖాతరు చేస్తూ ప్రజలు రోడ్లపై తిరుగుతుండడం వల్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇంట్లో నుంచి ఒకరు వెళ్లి సామాగ్రిని కొనుగోలు చేసుకునేలా అనుమతి ఇచ్చారు. ద్విచక్ర వాహనంపై అయితే ఒకరు.. కారులో అయితే ఇద్దరు వెళ్లాలని పదేపదే సూచిస్తున్నారు.
అయినా కొంత మంది ఆ నిబంధనలను లెక్కచేయడం లేదు. ద్విచక్ర వాహనంపై అనవసరంగా ఇద్దరు వెళ్లడం లేదా భార్యాభర్తలు కలిసి వెళ్లడం చేస్తూ ఉన్నారు. దానితో పోలీసులు వారికి దండం పెట్టి మరీ.. వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. యువకులు అనవసరంగా రోడ్లపై తిరుగుతుంటే మాత్రం వారి లాఠీలకు పని చెప్తున్నారు. మరోసారి అనవరసంగా రోడ్లపైకి రావడానికి యువకులు భయపడుతున్నారు.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి