జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే 158 వాహనాలు స్వాధీనం చేసుకొని.. 3500 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్పీ సింధూ శర్మ ఆదేశాలతో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆదివారం రోజు నుంచి సరుకు రవాణ చేసే వాహనాలను నిలిపేశారు.
ఉదయం 10 నుంచి రాత్రి తొమ్మిది వరకు సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. సరుకు రవాణా, లోడింగ్ , అన్‌లోడింగ్ కార్యకలాపాలను రాత్రి 9 నుంచి మరసటి రోజు ఉదయం 8 గంటల లోపే పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ పరిస్థితిని కలెక్టర్ రవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ ఆపన్న హస్తం.. గౌరవంగా తుది మజిలీ!