జగిత్యాల జిల్లాలో రెండు గ్రామాల మధ్య భూ వివాదం(Land Dispute) నెలకొంది. సారంగపూర్ మండలం నగునూరు, వడ్డెర కాలనీ గ్రామాల మధ్య సరిహద్దు భూవివాదం నెలకొంది. అటవీ భూమికి సంబంధించిన భూమి తమదే అంటూ రెండు గ్రామాల వారు పోటాపోటీగా మాట్లాడుతున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామాల్లో భూ వివాదం చిచ్చురేపుతోంది. ఈ భూ వివాదాన్ని ఇరు గ్రామాల పెద్దలు.. రెవెన్యూ, అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తాజాగా వడ్డెర కాలనీ గ్రామస్థులు దుర్గాదేవి విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అమ్మవారి విగ్రహానికి పూజలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ముందు జాగ్రత్తగా గొడవ జరకుండా పోలీసులను మోహరించారు. వివాదం ముదరకుండా అటవీ హద్దులను తేల్చేందుకు అటవీ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. నగునూరు పంచాయతీ నుంచి కొత్తగా వడ్డెర కాలనీ పంచాయతీ ఏర్పాటైంది. దీంతో సరిహద్దు వివాదం నెలకొని రెండు గ్రామాల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రోజు రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: Chalo Raj bhavan: ఎక్కడికక్కడ ముళ్లకంచెలు.. రాజ్‌భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు!