Lakshmipur Paddy farmers protest : వరి వేసింది మొదలు పంట కోసే వరకు రైతులకు తిప్పలు తప్పటం లేదు. ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఆశలపై మిల్లర్లు నీళ్లు చల్లుతున్నారు. క్వింటా ధాన్యంపై తరుగు పేరిట 8 కిలోల కోత విధిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మిల్లర్లు దోపిడితో ఎకరాకు రూ.8 నుంచి 10 వేలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను జగిత్యాల సొసైటీలో వడ్లు తూకం వేయించాను. 187 బస్తాలకు గాను 176 బస్తాలు వేశారు. నా వడ్లలో 4.40 క్వింటాలు రైసు మిల్లర్లు కట్ చేశారు. అలా అయితేనే తీసుకుంటామని తేల్చి చెప్పారు. దిక్కులేక నేను సరేనన్నాను. ఒక్క నామీద నాలుగు క్వింటాల వడ్లు పోతే... పది లారీలు మీద 60 క్వింటాల వడ్లు పోతున్నాయి. రైసు మిల్లర్లు ఇలా దోచుకుంటే మేం ఎలా బతకాలి?
-రైతు, లక్ష్మిపూర్
'పట్టించుకోవడం లేదు'
Paddy procurement problems : ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిల్లర్లు కోతలు విధిస్తున్నట్లు అధికారులకు తెలిసినా పట్టించుకోటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్లకు కొమ్ముకాస్తురన్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం అమ్మిన రైతులు రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమించాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోని రైతుల వద్దకు తిరిగి వినతి పత్రాలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని నిర్ణయించారు.
నేను 400 క్వింటాల వడ్లు పండించినా. 5 క్వింటాలు కట్ అయినయ్. రూ.పదివేలు నష్టపోయిన. ఏజ్ బార్ కావడంతో నేను ఎక్కడకూ పోలేకపోయిన. మరి ఇంతలా నష్టం చేస్తుంటే మేం ఏం చేయాలి? పబ్లిక్ కూడా బతకాలి కదా.
-రైతు, లక్ష్మిపూర్
గత మూడు సీజన్ల నుంచి మిల్లర్లు కోత విధిస్తున్నారని రైతులు తెలిపారు. జిల్లాలోని అన్నదాతలందరినీ కలుపుకుని మిల్లర్లపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
నేను ఒక యువరైతును. నాలాంటి వాళ్లు ఈరోజుల్లో వ్యవసాయం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. నేను అరవై బస్తాలు పండిస్తే... దాదాపు 2 క్వింటాల ధాన్యం కోతకు గురైంది. పరిస్థితి ఇలాగే ఉంటే మా లాంటి యువరైతులు వ్యవసాయం చేయరు. దీనిపై మేం పోరాటం చేస్తాం. వడ్లు ఎలా కొనరో చూస్తాం.
-యువరైతు, లక్ష్మిపూర్
రాష్ట్రంలో గోదాముల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఉన్న వాటిని ఉపయోగించుకోకపోవడం, ఏడాదిన్నర క్రితం పెట్టిన నిల్వలను ఇప్పటికీ తరలించకపోవడంతో కొత్త పంటలు, ఎరువులను ఉంచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీజిల్, పెట్రోలు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి రైలు మార్గాలకు సమీపంలో ఉన్న గోదాముల్లో మాత్రమే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిల్వలకు అనుమతిస్తోంది. ప్రస్తుతం మొత్తం 9.16 లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న గోదాములు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రైలు మార్గాలకు దగ్గరగా ఉన్నవి 2 లక్షల టన్నులకే సరిపోతుండడంతో మరిన్ని కావాలని ఎఫ్‌సీఐ అడుగుతోంది. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: NGT Verdict: 'అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల చేపట్టవద్దు'