ETV Bharat / state

కొండగట్టులో భక్తులకు కోటి కష్టాలు.. ఆలయంలో అరకొర వసతులు - lack of facilities in kondagattu hanuman temple

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నా కనీస ఏర్పాట్లు కూడా కానరావటంలేదు. మండుతున్న ఎండలకు తోడు.. వచ్చే ఏప్రిల్‌ నెలలో హనుమాన్‌ జయంతికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో... తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. మరోపక్క ఆలయంలో అరకొరగా ఉన్న వసతి, మౌలిక వసతుల కల్పనపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

lack of facilities in kondagattu anjaneya swamy temple in jagtial district
అంజన్న ఆలయంలో అరకొర వసతులు
author img

By

Published : Mar 6, 2021, 11:51 AM IST

రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాల తర్వాత అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది కొండగట్టు అంజన్న క్షేత్రం. దేవాలయానికి ప్రతి మంగళ, శనివారాల్లో 20 వేల నుంచి యాభైవేల మంది వరకు భక్తులు దర్శనానికి తరలివస్తారు. ఇక చిన్న హనుమాన్‌, పెద్ద హనుమాన్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు నుంచి నాలుగు లక్షల మంది దీక్షాపరులు ఆలయంలో మాల విరమణ చేస్తారు. ఇంత పెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న అంజన్న ఆలయం మాత్రం... అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది.

రోజూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు స్నానం చేసేందుకు కోనేరులో నీళ్లు ఉండటం లేదు.. ఎవరైనా ముఖ్యనాయకులు, అధికారులు వచ్చినప్పుడే నీళ్లు నింపి ఆ తర్వాత రోజుల్లో అసలు పట్టించుకోవటంలేదనే ఆరోపణలున్నాయి. భక్తులు బస చేసేందుకు కూడా గదులు సరిపోవడంలేదు. మరుగుదొడ్ల పరిస్థితి అంతంతమాత్రమే ఉండగా... పారిశుద్ధ్యం గురించి అసలే పట్టించుకునే నాథుడే లేడు.

ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చుతున్నట్లు ఎనిమిదేళ్ల కిందటే ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. ఇంతవరకూ ఆ ఊసే లేదు. కొండగట్టు ఘాట్‌ రోడ్డుపై ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 66 మంది ప్రయాణికులు చనిపోయిన తర్వాత నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామని ప్రతిపాదనలు రూపొందించారు. ఇంతవరకూ ఆ రహదారి నిర్మాణం చేపట్టలేదు.

రానున్న చిన్న హనుమాన్‌ జయంతి వరకైనా మౌళిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.