ETV Bharat / state

'కమిషనర్​ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు' - sanitation employees protest

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమను కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న తమకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

labours protest against in metpally municipal office

author img

By

Published : Jul 31, 2020, 6:16 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తమను ఇష్టం వచ్చినట్టు తిడుతూ... ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఆందోళన చూసి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కమిషనర్​తో కార్మికులు వాగ్వాదానికి దిగారు.

కార్మికులను కార్యాలయలోకి రానివ్వకపోవటం ఎంతవరకు సమంజసమని కమిషనర్​ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కమిషనర్​... కరోనా ప్రభావం వల్లే ఎవరినీ లోనికి అనుమతించడం లేదు తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని సమాధానం చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న తమకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా సౌకర్యాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్ననామని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కార్మికులు పేర్కొన్నారు.

ఇదీచదవండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.