ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి, తెలంగాణ ఆదాయ పన్ను శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కోటిని అర్చకులు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఉగ్ర, యోగ నరసింహస్వామి వార్ల ఆలయాలతో పాటు, అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇదీ చూడండి: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగనే ముఖ్య అతిథి..!