ఎస్సారెస్పీ స్థలాల్లో నివసిస్తున్న వారికి అండగా ఉండి, శాశ్వతంగా ఇళ్ల పట్టాలను అందించేందుకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్‌కు ఇరువైపులా గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలతో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. ఎస్సారెస్పీ స్థలాల్లో ఉండే వారిని గత కొన్ని రోజులుగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దీంతో బాధితులు మెట్పల్లి సబ్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే హాజరై... బాధితులకు సంఘీభావం తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఎవరికీ సౌకర్యాలు రద్దు చేయరని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి... శాశ్వత పట్టాలు అందేలా చూస్తానన్నారు. పురపాలక సంఘం తరఫున రావాల్సిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ... బాధితులు ఎమ్మెల్యేకు సన్మానం చేశారు. కాలనీవాసులకు అవసరమైన సౌర్యాలు కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: గుమ్మడికాయ కాదు టమాటానే!