కోడి పెట్టిన గుడ్లను గూట్లో పెట్టగా స్థిర ఉష్ణోగ్రత కారణంగా కోడి పొదగకుండానే గుడ్లలో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చిన సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఉత్తమ్ ప్రభాకర్ ఇంట్లో ఉన్న కోడి పదిహేను రోజులుగా గుడ్లు పెడుతోంది. ఈ క్రమంలో కోడిని ఇతరులకు పెంపకం కోసం ఇచ్చారు. కోడి పెట్టిన గుడ్లను ఇంట్లోకి వాడుకోగా రెండు గుడ్లు మిగిలాయి. గూట్లో పెట్టిన గుడ్లలో నుంచి కోడి పిల్లలు బైటకు వచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇరవై ఒక్క రోజులు స్థిర ఉష్ణోగ్రత కారణంగా కోడి పొదగకున్నా కోడిపిల్ల బైటకు వచ్చే అవకాశముందని పశువైద్యాధికారులు చెప్చారు.
ఇవీ చూడండి: 'కుళ్లిపోయిన మటన్ బిర్యానీ పెట్టారు...'