ఇవీ చూడండి:జోరుగా ఇందూరులో తెరాస సభ
కేసీఆర్ ప్రకటనతో గ్రామస్థుల హర్షం
నిజామాబాద్ సభలో కేసీఆర్ ఇచ్చిన హామీతో ఆ గ్రామ ప్రజలు సంతోషంలో మునిగితేలుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలంగా మార్చుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మండలంగా మారనున్న ఒడ్డెలింగాపూర్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డె లింగాపూర్ గ్రామాన్ని మండలం కేంద్రంగా మార్చుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ సభలో ప్రకటించారు. సీఎం ప్రకటనతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఒడ్డె లింగాపూర్ మండల కేంద్రంగా మారితే దాని పరిధిలో 12 గిరిజన గ్రామాలకు మేలు జరుగుతుంది. రాయికల్లో 32 గ్రామాలు ఉండగా మొత్తం 60 వేల మంది జనాభా ఉన్నారు. ఒడ్డెలింగాపూర్ 30 వేల మంది జనాభాతో నూతన మండలం ఏర్పాటు కానుంది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా గిరిజన గ్రామాలు ఉన్న మండలంగా నిలువనుంది.
ఇవీ చూడండి:జోరుగా ఇందూరులో తెరాస సభ
sample description