జగిత్యాల జిల్లా పెంబట్లలో తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత రోడ్ షో నిర్వహించారు. జగిత్యాలలోని ప్రతి గ్రామంలో రెండు పడక గదులు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీగా కేంద్రంలో ఉండటంవల్లే నిజామాబాద్ నుంచి పెద్దపల్లి రైల్వేలైన్ సాధ్యమైందన్నారు. ఈసారి కూడా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల వేళ భాజపా అన్ని అబద్ధాలే చెబుతోందని కవిత ఆరోపించారు.
ఇవీ చూడండి:'ఇక్కడ 16 గెలిపిస్తే అక్కడ 116 వస్తాయి'