జగిత్యాల పట్టణాన్ని మించి రాయికల్ను తీర్చిదిద్దుతామన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించామని తెలిపారు. రూ.70 కోట్లతో బోర్లకుంట వంతెన పనులు చేపట్టినట్లు ఎంపీ స్పష్టం చేశారు. రాయికల్ నుంచి మేడిపల్లి వరకు జాతీయ రహదారి కోసం దిల్లీలో కోట్లాడి రూ.16 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పనులు కూడా నడుస్తున్నాయన్నారు. విద్య, వైద్యం, బీడీ కార్మికులు, తదితర సమస్యలపై ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రజల సమ్మతంతో రాయికల్ మండలం నుంచి మరో మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: భద్రాద్రిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు