జగిత్యాల జిల్లా డీపీవో కార్యాలయం ఎదుట పంచాయతీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన చేపట్టారు. తమకు పని భారం తగ్గించాలని.. జేపీఎస్‌లకు ఉద్యోగ భద్రతను కల్పించాంటూ పంచాయతీ అధికారి శేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. నాగర్‌కర్నూల్‌లో ఆత్మహత్య చేసుకున్న జేపీఎస్ స్రవంతి మృతిపట్ల సంతాపం తెలిపారు. జేపీఎస్‌లకు పే స్కేల్ ప్రకటించి సరైన పనివేళలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండిః ఈ నిబంధనలు పాటిస్తే... జలగండాలకు తావు ఉండదు