జగిత్యాల జిల్లా మెట్పల్లిలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో పాత్రికేయులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. సబ్ కలెక్టర్ గౌతమ్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం పాత్రికేయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెండింగ్లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లతో పాటు హెల్త్ కార్డులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఏళ్లతరబడి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ప్రజల పక్షాన నిలుస్తున్న తమను ప్రభుత్వం చిన్న చూపు చూడడం బాధాకరమని సంఘం సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి: నేటి అర్ధరాత్రి నుంచే సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!