ETV Bharat / state

Jeevan Reddy Fire on KTR : 'మాది చంద్రబాబు కాంగ్రెస్​ అయితే.. మరి మీ​ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల సంగతేంటి? - జీవన్​ రెడ్డి కామెంట్స్ ఆన్​ కేటీఆర్​

MLC Jeevan Reddy Latest Comments : రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్​.. కాంగ్రెస్​ చర్చించినప్పటి నుంచే రైతులకు ఇస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. జగిత్యాల పర్యటనలో మంత్రి కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో చంద్రబాబు కాంగ్రెస్​ అయితే.. బీఆర్ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ నుంచి వచ్చారో కేటీఆర్​ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 17, 2023, 4:26 PM IST

కేటీఆర్​పై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

MLC Jeevan Reddy Comments on KTR : ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్​ అన్న కేటీఆర్​ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలని బదులిచ్చారు. జగిత్యాల జిల్లాలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి.. మంత్రి కేసీఆర్​పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో 10 గంటలు కూడా విద్యుత్​ సరఫరా లేదని.. రాష్ట్రవ్యాప్తంగా ఆ అంశంపై చర్చ జరిగినప్పిటి నుంచి 24 గంటలు కరెంట్​ వస్తుందని అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ జగిత్యాలలో పర్యటించి కాంగ్రెస్​ పార్టీపై చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు.

MLC Jeevan Reddy Latest press meet in Jagtial : రైతులకు రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 24 గంటల విద్యుత్ వచ్చిందో, లేదో రైతులను అడిగితే తెలుస్తుందని పేర్కొన్నారు. అన్నదాతలకు ఇంత వరకు రుణమాఫీ చేయలేదని ఆగ్రహించారు. రైతు బంధు నగదు పూర్తిగా కర్షకులకు రాలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో 5 నుంచి 10 కిలోల కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యలన్నీ కేటీఆర్​కు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ ఎప్పుడూ రైతులకు మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్​​పై రైతు వేదికల దగ్గర సమావేశాలు నిర్వహిస్తామని బీఆర్​ఎస్​ అన్నదని.. ఆ సమావేశాలకు కార్యకర్తలు తప్ప రైతులు ఎవరూ రారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్​ అన్న మంత్రి.. బీఆర్​ఎస్​ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

Jeevan Reddy Comments: 'సీఎం హోదాలో కేసీఆర్​ అలా మాట్లాడటం సిగ్గుచేటు..'

"రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్​ చర్చించినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతక ముందు కేవలం 12 గంటలు మాత్రమే ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో మొదటిసారి ఉచిత విద్యుత్​ను ప్రవేశపెట్టింది కాంగ్రెస్​ పార్టీ. కేసీఆర్​ ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు పంట రుణాలపై చెల్లించాల్సిన రుణమాఫీ ఇవ్వలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా రైతు బంధు 20 ఎకరాలకు అమలు కావాలి. కేవలం 5 ఎకరాలకే పరిమితం అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ టీడీపీ పార్టీ అన్నారు. బీఆర్​ఎస్​లో ఉన్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు. అసలు ఎవరిది టీడీపీ అని నేను ప్రశ్నిస్తున్నాను. టీడీపీ కాంగ్రెస్​ కాదు.. టీఆర్​ఎస్​ పార్టీయే టీడీపీ పార్టీ. రైతాంగానికి ఎప్పటికైనా మేలు చేసేది కాంగ్రెస్​ పార్టీనే." - జీవన్​ రెడ్డి, ఎమ్మెల్సీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.