అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్య వెనుక ఎవరున్నారు అనేది తెలియాలంటే... జుడీషియల్ ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓవైపు భూ ప్రక్షాళనలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరును ప్రశంసిస్తూ... మరోవైపు రెవెన్యూ శాఖ అవినీతి శాఖగా మారిందని సీఎం పేర్కొనడం... హాస్యాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు.
హత్య ఘటనను ఖండిస్తున్నానన్నారు జీవన్ రెడ్డి. ఒకరిద్దరు తప్పు చేస్తే రెవెన్యూ శాఖనే తప్పుపట్టడం సరికాదన్నారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ కార్యాలయానికి తాళం