ETV Bharat / state

టీవీ చూసేందుకు వెళ్లి అత్యాచారం... ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్ విద్యార్ధి ఘాతుకం - jagtial district news

టీవీ చూసేందుకు వెళ్లి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ ఇంటర్ విద్యార్థిపై జగిత్యాలలో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశామన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామన్నారు.

jagtial sp sindhu sharma
jagtial sp sindhu sharma
author img

By

Published : Sep 16, 2021, 10:57 PM IST

Updated : Sep 17, 2021, 10:02 AM IST

జగిత్యాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్​ చదువుతున్న బంధువే అత్యాచారానికి పాల్పడ్డారని ... బాధితురాలి తల్లి ఫిర్యాదుచేసినట్లు ఎస్పీ సింధూ శర్మ వెల్లడించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుందని.. బాధితుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితున్ని అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లి.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఫిర్యాదుచేశారన్నారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్​ 448, 376(ఏ)(బీ), పోక్సో చట్టం 2012 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నిందితునికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామన్నారు.

నిన్న మధ్యాహ్నం ఐదేళ్ల చిన్నారిపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. వెంటనే ధర్మపురి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు. నిందితుడు ఇంటర్​మీడియట్​ చదువుతున్నట్లు సమాచారం. అన్ని ఆధారాలతో ఛార్జిషీట్​ దాఖలు చేస్తాం. విచారణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. నిందితుడికి కనీసం 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.

- సింధూ శర్మ, జగిత్యాల ఎస్పీ

టీవీ చూసేందుకు వెళ్లి అత్యాచారం చేశాడు: ఎస్పీ

ఇదీచూడండి: సైదాబాద్ ఘటన మరువక ముందే.. జగిత్యాల జిల్లాలో మరో బాలికపై అత్యాచారం

Last Updated : Sep 17, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.