కృష్ణపట్నం ఆనందయ్య మందు సరైంది కాదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విమర్శించారు. ఆయన ఇచ్చిన మందు వాడిన ప్రజలు రాత్రంతా కళ్ల మంటతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. జిల్లాలోని పలువురు రోగులు ఆనందయ్య ఇచ్చిన మందును వాడగా వారంతా ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన ఎమ్మెల్యే మందు పనిచేస్తుందా లేదా అని అడిగారు.
కళ్ల డాక్టర్ అయినా కళ్లలో పసరు పోస్తే జబ్బు తగ్గదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చే మందుతో కరోనా తగ్గితే ఆనందయ్యకు పాదాభివందనం చేస్తానన్నారు. ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వం ఇచ్చే మందులు వాడి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: lockdown 2.0: లాక్‌డౌన్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారు?: సీఎం కేసీఆర్