వరి కోతలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం వరికోత యంత్రాలను ప్రొత్సహిస్తుంటే.. జగిత్యాల జిల్లా కన్నాపూర్ గ్రామ సర్పంచ్ మాత్రం ఊళ్లో వరి కోతలు కోయాలంటే రెండు వేల పన్ను కట్టించుకున్నాడు. వాస్తవానికి వరి కోత యంత్రానికి గ్రామ పంచాయతీలు ఎటువంటి పన్ను వేయరాదు.
జగిత్యాల రూరల్ ఠాణాలో సర్పంచ్ కొక్కు సుధాకర్‌పై కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ఈ వ్యవహారంపై సర్పంచ్‌కు షోకాజ్ నోటిసులు జారీ చేశారు.
ఇదీ చూడండి:- 'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'