జగిత్యాల జిల్లాలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి ఒక కిలో 65 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో 300 గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని జగిత్యాల, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్, సారంగాపూర్, ధర్మపురి మండలాల్లో కొంతకాలంగా 21 దొంగతనాలు, దోపడి కేసులు నమోదయ్యాయని ఎస్పీ సింధూశర్మ తెలిపారు.
కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్ పోలీసులు బృందంగా ఏర్పడి దొంగను పట్టుకున్నారని ఎస్పీ వెల్లడించారు. పట్టుకున్న నగలు విలువ 56 లక్షలు ఉంటుందని సింధూశర్మ తెలిపారు. దొంగను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసులకు రివార్డు అందిస్తామన్నారు.
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'