జనాలంతా వినాయక చవితి పండగ జరుపుకుంటూ.. ఆనందోత్సవాల్లో మునిగి తేలుతుంటే... జగిత్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పక్షం రోజుల నుంచి యూరియా దొరక్క రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయికల్ మండలం ఉప్పుమడిగే సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు జగిత్యాల- రాయికల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యూరియా కోసం తరలివచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా సరఫరాలో అధికారులు విఫలమయ్యారని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సకాలంలో అందించకపోతే దిగుబడులు రావని.. వెంటనే యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు :సీఎం