జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంలో ఓట్ల కోసం కోళ్లను పంపిణీ చేస్తుండగా స్థానిక భాజపా నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో కోళ్లను తరలిస్తూ ఇంటింటికీ పంచుతున్న అంతడ్పుల దుబ్బయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. తెరాస నాయకులు పంపిణీ చేయమన్నందునే.. కోళ్లను పంపిణీ చేస్తున్నానని దుబ్బయ్య తెలిపాడు.
ఇవీ చూడండి : 'రేపటి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం '