జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పురాతన కాశి బాగు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇవీ చూడండి: కొండంతా భక్తజనం... మారుమోగేను రామనామం