గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాద్ చేరుకుంటున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా క్వారంటైన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో కార్మికులు ప్లకార్డులు ప్రదర్శించారు.
వందే భారత్ మిషన్, ఛార్టర్ విమానాల్లో ప్రయాణించిన వారందరికీ ఉచితంగా సౌకర్యం కల్పించాలని గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాద్‌కు తగినన్ని విమానాలు నడపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్