ETV Bharat / state

బోగస్ మత్స్య సొసైటీలను రద్దు చేయాలి : సముద్రాల తిరుపతి గంగపుత్ర - Latest news in Telangana

గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం క్యాలెండర్ దుబాయ్​లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్​లో ఉన్న గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బోగస్ మత్స్య సొసైటీలను రద్దు చేయాలి : సముద్రాల తిరుపతి గంగపుత్ర
Gulf Gangaputra Unity Welfare Calendar Launch
author img

By

Published : Apr 24, 2021, 1:32 PM IST

Updated : Apr 25, 2021, 7:57 AM IST

తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం క్యాలెండర్ దుబాయ్​లో ఆవిష్కరించడం జరిగింది. గల్ఫ్​లో ఉన్న గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొని.. కాల్యెండర్​ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంగపుత్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ చెరువు భూకబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. చెరువుల్లో నీరు లేక గంగపుత్రులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జీవో నంబర్ 6 వల్ల గంగపుత్రులకు నష్టం జరుగుతుందని వెల్లడించారు.

గల్ఫ్​ గంగపుత్ర ఐక్యత సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ

'గల్ఫ్ వాసులకు వ్యాక్సిన్ కావాలి'

కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా గల్ఫ్​లో ప్రవాస భారతీయులు కష్టాల్లో ఉన్నందున తమను ఆదుకోవాలని తిరుపతి గంగపుత్ర కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ వాసులకు కరోనా వ్యాక్సిన్​ను అందజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణలో జీఓ నెం 6 అమలు తర్వాత ఏర్పాటు చేసిన బోగస్ మత్స్య సొసైటీలను రద్దు చేయాలని తిరుపతి డిమాండ్ చేశారు.

Last Updated : Apr 25, 2021, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.