GST ITC Fraud in Jagtial : సినీహీరో రామ్ నటించిన 'రెడీ' మూవీలోని ఓ కామెడీ సన్నివేశంలో పన్నులు ఎగవేత కోసం అనాథశ్రమం, అందులో పిల్లలు వారికి భోజనం తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పగా, ఇంత మంచి పని చేస్తున్నామా అనే లోపు అవి కేవలం పేపర్ పైన మాత్రమే ఉంటాయి, నిజ జీవితంలో ఉండవు అనగానే అందరు షాక్ అవుతాం. ఇలా కూడా మోసం చేస్తారా అని ఆలోచనలో పడతాం కదా! సరిగ్గా అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో జరిగింది. ఓ జీఎస్టీ ప్రాక్టీషనర్(GST Practitioner Fraud) తన దగ్గర ఉన్న సమాచారంతో పేపర్‌పైనే లావాదేవీలు నిర్వహించి ఏకంగా రూ.40 కోట్లు కొట్టేసినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ రకంగా కూడా మోసం చేస్తున్నారని షాక్ అవుతున్నారు.
GST Practitioner Fraud in Jagtial : జీఎస్టీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాలలో ఓ జీఎస్టీ ప్రాక్టీషనర్ పలు సంస్థల వ్యాపార లావాదేవీలను జీఎస్టీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ క్రమంలో కొందరు వ్యాపారస్థులు వివిధ కారణాలతో తమ కార్యకలాపాలను పూర్తిగా మూసి వేశారు. వారికి సంబంధించిన జీఎస్టీ లైసెన్స్ వివరాలతో(Details of GST Licence) పాటు ఆ సంస్థలకు చెందిన మరింత సమాచారం ప్రాక్టీషనర్ వద్ద ఉండిపోయింది. ఇదే సరైన అవకాశంగా తీసుకుని కొత్త తరహా దోపిడీకి ఆ ప్రాక్టీషనర్ తెరతీశారు.
Latest Financial Fraud in Telangana : వ్యాపారాలన్ని పూర్తిగా మూసివేసిన సంస్థలకు సంబంధించిన పాన్ నంబర్లు, జీఎస్టీ లైసెన్స్ వివరాలు, ఇతరత్రా వివరాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే పేపర్‌పైనే లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తప్పుడు పత్రాలను జీఎస్టీ(GST) వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశారు. ఈ క్రెడిట్‌ను ఇతర వ్యాపార సంస్థలకు పంపిణీ చేశారు. ఆయా సంస్థలు ఈ క్రెడిట్‌ను వాడుకొని జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డాయి. ఆయా సంస్థల నుంచి ఈ జీఎస్టీ ప్రాక్టీషనర్ నగదు రూపంలో తీసుకున్నారు.
జగిత్యాల జిల్లాను కేంద్రంగా చేసుకుని చేస్తున్న అక్రమాలను కరీంనగర్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ రవికుమార్ దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌కు తెలియజేశారు. ఈ కుంభకోణం(GST Practitioner Scam)పై తనిఖీలు నిర్వహించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమిషనర్ సాయికిశోర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ప్రాక్టీషనర్‌కు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశాయి.
GST Council Meeting Today 2023 : రైతులకు తీపి కబురు.. జీఎస్టీ 28% నుంచి 5 శాతానికి తగ్గింపు!
40 Crore Rupees Fraud in Telangana : ప్రాక్టీషనర్ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలను నిలిపేందుకు ప్రత్యేక బృందాలు(GST Special Forces) చర్యలు తీసుకున్నాయి. ఇప్పటివరకు పరిశీలన చేసిన పత్రాల ప్రకారం దాదాపు రూ.40 కోట్లు మేర ఆ ప్రాక్టీషనర్, ఇతర వ్యాపార సంస్థలు నొక్కేసినట్లు అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. ఇలాంటి కొత్త తరహా అక్రమాలకు తెరలేపడంతో అధికారులు సైతం షాక్ అవుతున్నారు. జీఎస్టీ ప్రాక్టీషనర్ మొత్తం అక్రమాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. ఈ కుంభకోణానికి చెందిన పత్రాల పరిశీలన ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
పన్నుల వసూళ్లు పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ పక్కాప్లాన్
GST Ammendments: ప్రభుత్వానికి ఆదాయం పెంచనున్న జీఎస్టీ సవరణలు