ETV Bharat / state

తమ సభ్యుడ్ని కిడ్నాప్ చేశారని రోడ్డెక్కిన గంగపుత్రులు - కోనరావుపేట్ పోలీస్ స్టేషన్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలోని కోనరావుపేట్ గ్రామంలో అలజడి రేగింది. చెరువులో చేపల వేటకు వెళ్లిన గంగపుత్ర యువకులను ఆకుల శ్రీనివాస్ సహా మరికొందరు కిడ్నాప్ చేశారని గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

తమ సభ్యుడ్ని కిడ్నాప్ చేశారని రోడ్డెక్కిన గంగపుత్రులు

author img

By

Published : Oct 4, 2020, 2:50 AM IST

Updated : Oct 5, 2020, 1:24 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలోని కొనరావుపేట్ గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లిన కొండ్రికర్ల గంగపుత్ర మత్స్య సొసైటీ సభ్యులను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని గంగపుత్ర సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గంగపుత్ర యువకులను తీవ్రంగా కొట్టి కిడ్నాప్ చేసిన క్రమంలో నిందితుల చెర నుంచి రమేశ్ అనే యువకుడు తప్పించుకున్నాడు. గణేశ్​ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొడుతూ భయాందోళనకు గురి చేసినట్లు రమేశ్ మిగతా సభ్యులకు చెప్పారు.

స్పందించిన సర్పంచ్..

విషయం తెలుసుకున్న కోనరావుపేట్ గంగపుత్ర సంఘం సభ్యులు గ్రామ సర్పంచ్ మురళి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన సర్పంచ్ మురళి వెంటనే పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. అనంతరం పోలీసులతో కలిసి కోనరావుపేట్ గ్రామస్థులతో కలిసి కొండ్రికర్ల గ్రామానికి వెళ్లారు. పోలీసుల రాకతో కిడ్నాపర్లు గణేశ్​ను స్థానిక పోలీస్ స్టేషన్​లో అప్పజెప్పి లొంగిపోయారు.

ఇప్పటికీ కేసు నమోదు కాలేదు..

కిడ్నాప్ అంశంపై ఇప్పటివరకు పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేయకపోవడంపై కోనరావుపేట్ గంగపుత్రులు, గ్రామ సర్పంచ్ మురళి అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. దాదాపు 200 మంది గంగపుత్రులుతో కలిసి గ్రామ సర్పంచ్ మురళీ, గంగపుత్ర జిల్లా నేతలు అరుముళ్ల పవన్ గంగపుత్ర, పల్లికొండ భూమేష్ గంగపుత్ర ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్​ను ముట్టడించారు. స్పందించిన సీఐ నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

తమ సభ్యుడ్ని కిడ్నాప్ చేశారని రోడ్డెక్కిన గంగపుత్రులు

ఇవీ చూడండి : దొంగతనాలకు పాల్పడుతోన్న ముఠా అరెస్ట్​

Last Updated : Oct 5, 2020, 1:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.